ఆహారం

కరోనా వైరస్ నివారణకు ఉచితంగా హోమియో మందును పంపిణీ.

న‌ర్సీప‌ట్నం: కరోనా వైరస్ నివారణకు నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా హోమియో మందును పంపిణీ చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ A శ్రీదేవి తెలియజేశారు.ఈ నెల 10వ తేదీ మంగళవారం ఆర్ అండ్ బి ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్స్ ‌అసోసియేషన్ బిల్డింగ్ నందు సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల వరకు కరోనా వైరస్ వ్యాధి సోకకుండా హోమియో మందును ఉచితంగా పంపిణీ చేయనున్నామని తెలిపారు.ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ శ్రీదేవి తెలియజేశారు.