ఆహారంప్రాంతీయంరాష్ట్రీయం

కరోనా వ్యాప్తిపై అధికారులు తగు చర్యలు చేపట్టాలి.

భీమిలి : విశాఖలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తో పాటు గ్రామ సచివాలయం నుండి జిల్లా సచివాలయం వరకు అధికారులందరూ  అప్రమత్తంగా ఉంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను అదేశించారు. ప్రజలందరికీ అవగాహన కల్పించాలని,తీసుకోవాల్సిన  జాగ్రత్తలు, నిరోధక చర్యలు,నియంత్రణపై తగిన సూచనలు ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయి వైద్య ఆరోగ్య సిబ్బందికి, గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందికి,వాలంటీర్లకు, ఎస్.హెచ్.జి.ల మహిళలకు,విద్యార్థులకు ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహనను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదన్నారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు. భీమిలిలో అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.వివిధ శాఖల జిల్లా అధికారులతో పంచాయతీ రాజ్‌  తదితర అభివృద్ధి పనులపై భీమిలి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాలు,తాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి నిర్మించే క్రమంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు.ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నందున మంజురైన అభివృద్ధి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లు,తాగునీటి పనులు, భవనాలు ఎన్ని మంజూరు అయ్యాయో, వాటిలో పూర్తి అయినవి,వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల వివరాలు, సమస్యలపై చర్చించారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలను వెంటనే పూర్తి చేయాలనన్నారు. మనబడి, నాడు-నేడు పథకాల  కింద మండలాలలో ఈ ఏడాది మొత్తం 28 స్కూల్ బిల్డింగ్ లకు పనులు నిర్వహిస్తామన్నారు. పాఠశాలల టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంచాయతీ రాజ్ కింద నాడు-నేడులో 50 శాతం పనులు ఇచ్చారని తెలిపారు. పాఠశాలల ప్రహరీ గోడల వరకు ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామని, ప్రహరీ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి  అధికారులను ఆదేశించారు. అలాగే గ‌త కొన్ని నెలలుగా మూత ప‌డిన చిట్టి వ‌ల‌స జ్యూట్ మిల్ కార్మికుల స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది..కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో విశాఖపట్నం అక్కయ పాలెం లేబర్ ఆఫీస్ లో జెసిఎల్ , డీసీయెల్ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ గడువు దాటి పోయింది, వెంటనే అగ్రిమెంట్ ని పునరుద్ధరణ చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు  జ్యూట్ మిల్ కార్మికుల‌కు వివరించారు..ఈ సమావేశంలోమండల అధికారులు,జీవీఎంసీ జోనల్ కమీషనర్లు,స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…