ఆహారంరాజకీయం

కరోనా సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై నిరసన.

నర్సీప‌ట్నం : ‌కరోనా సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం పై నిరసనగా మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు శివపురం ఇంటి వద్ద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య డిమాండ్లు చేసారు. 1.ప్రతి పేద కుటుంబం ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. 2. మృతిచెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లు నర్సులు పోలీసులు మీడియా పారిశుద్ధ్య సిబ్బందికి 50 లక్షలు చెల్లించాలి 3. మద్యం దుకాణాలను వెంటనే మూసి వేయాలి.4.ఆసుపత్రిలో బెడ్స్‌ పెంచాలి,కరవెంటర్ కేంద్రాలలో మంచి ఆహారం అందించాలి. 5. రేషన్ సరుకులు నేరుగా ఇంటికే అందించాలి,వేలిముద్రలు తీసుకోరాదు. 6. కరోన మృతులకు 10 లక్షల భీమా సౌకర్యం కల్పించాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గవిరెడ్డి రమణ, రావాడ నాయుడు, దనిమిరెడ్డి మధు, జంప‌న నాగేంద్ర‌రాజు పాల్గున్నారు.