ఆహారంరాజకీయం

ఈఎస్‌ఐ స్కామ్ కు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును 3గంటలు ప్రశ్నించిన ఏసీబీ

గుంటూరు: ఈఎస్‌ఐ స్కామ్ కు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్​లో దాదాపు 3 గంటలకు పైగా ప్రశ్నించారు.విచారణ కోసం అచ్చెన్నాయుడిని ఏసీబీ పోలీసులకు మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటిరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు గుంటూరు జీజీహెచ్​కి చేరుకున్న అధికారులు సూపరింటెండెంట్ సుధాకర్​తో మాట్లాడి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం జీజీహెచ్ రెండో ప్లోర్ లో అచ్చెన్నాయుడు రూమ్ కి వెళ్లి విచారించారు..ఇక మరో రెండ్రోజుల పాటు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు.అచ్చెన్నాయుడి సెపరేట్ గానే ప్రశ్నిస్తారో… లేక మిగతా నలుగురితో కలిపి విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఏసీబీ డీఎస్పీ ప్రసాద్​ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సాగుతోంది. విచారణ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు..