గుంటూరు : గుంటూరు విద్యార్థినిపై అత్యాచారం కేసులో విస్తుపోయిన అనేక విషయాలు బయటపడుతున్నాయి. నగరానికి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఓ విద్యార్థినికి మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినికి మత్తుమందిచ్చి అత్యాచారం చేసి ఆ వీడియోలను పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వెలుగులోకి కొత్త విషయాలు.. ఏ1 వరుణ్ తేజ, ఏ2 కౌశిక్ ను అరెస్ట్ చేసిన దిశ పోలీసులు..గుంటూరులో న్యాయశాస్త్రం చివరి ఏడాది చదువుతున్న వరుణ్ తేజ గుంటూరు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఏ2 కౌశిక్. వరుణ్ తేజ్ కి బాధితురాలు ఇంటర్మీడియట్ నుంచి పరిచయం.. ప్రేమిస్తునంటూ బాధితురాలి వెంటపడ్డ వరుణ్ తేజ్.. యువతికి మత్తు మందు ఇచ్చి నగ్న వీడియోలు తీసిన వరుణ్ తేజ్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించిన ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం.. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తాం..ఎవరైనా కేసును నిరుగార్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదన్నారు…