బీటెక్ విద్యార్థిని తేజశ్రీ మృతిపై విచారణ
విజయవాడ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని తేజశ్రీ మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గొడుగుపాలెంలో బీటెక్ విద్యార్థిని తేజశ్రీ ఈ నెల 6వ తేదీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎంతగానో బాధించిందన్నారు.
విద్యార్థిని మృతిపై ప్రొఫెసర్ యేసు రత్నం, ప్రొఫెసర్ స్వర్ణ కుమారి, ప్రొఫెసర్ స్వరూప రాణిలతో కమిటీ విచారణ నిర్వహిస్తుందన్నారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.