జిల్లాలుస్థానికం

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లా అదనపు ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య.

న‌ర్సీప‌ట్నం: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విధులలో ఉండే ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని అందరూ ఒకరినొకరు సమన్వయంతో పని చేసినప్పుడే విజయవంతం అవుతుందని జిల్లా అదనపు ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య పేర్కొన్నారు. శుక్రవారం నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జోనల్ అధికారులు, రూట్ అధికారులు,ఎలక్షన్ అధికారులు , అసిస్టెంట్ ఎలక్షన్ అధికారులు, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్,ఎంసిసి టీమ్, ఉమెన్ ప్రొటెక్షన్ పోలీస్ టీమ్ లకు ఎన్నికల నిర్వహణ పై శిక్షణ అందించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యం అని , వారికి కేటాయించిన విధులను తు.చ.తప్పకుండా ఎన్నికల నియమావళి ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు.ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఒకరినొకరు సమన్వయంతో సజావుగా పని చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలు,మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, విధిగా అమలు అయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల విధివిధానాలపై పూర్తి అవగాహనతో ఉంటూ వారికి కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్పందించి సంబందిత ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యి రిజల్ట్స్ డిక్లేర్ చేసే వరకూ కోడ్ వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలలో మద్యం , నగదు రవాణా కాకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి పెట్టి వెబ్ కాస్టింగ చేయడంతో పాటు, ర్యాలీ లను వీడియో తీయాలన్నారు.ఉదయం 6గం ల ను నుండి రాత్రి 10 గం ల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లు వాడటానికి అనుమతి ఉంటుందన్నారు.మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని 84650 13255 , 089322 95588 ఫిర్యాదులు నమోదు చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. నంబర్లను 24/7 అందుబాటులో ఉంచడం జరిగింది అన్నారు.సమావేశంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధారిటీ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు , నోడల్ అధికారుల బృందాలు , మండల తాసిల్దార్ జయ, మున్సిపల్ అధికారులు సిబ్బంది హాజరయ్యారు…

పోలింగ్ మెటీరియల్ రూమ్ ను తనిఖీచేసిన జిల్లా అదనపు ఎన్నికల అధికారి,సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య.
శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ రూమును సబ్ కలెక్టర్ సందర్శించారు. ఎన్నికలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్.కనకారావును ఆదేశించారు.