ఆంధ్రప్రదేశ్జిల్లాలుప్రాంతీయంరాజకీయం

నర్సీపట్నంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకలు

నర్సీపట్నం: అణగారిన వర్గాల ఆశా జ్యోతి,రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ “బాబా సాహెబ్ భీమ్ రామ్ జీ అంబేడ్కర్” 131 వ జయంతి వేడుకలు *BJYM* ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అబీద్ సెంటర్ లో గల అంబేడ్కర్ విగ్రహాన్నికి పూలమాలలు వేశారు. అనంతరం అసెంబ్లీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ రిజర్వేషన్ ఫలాలు అర్హులైన,నిజమైన షెడ్యూల్ కులాలకు దక్కిన ప్పుడే అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చిన వాళ్ళము అవుతామన్నారు. ఈదిశలో భారత ప్రధాని ప్రియతమ నరేంద్ర మోదీ ఆద్వర్యంలో అంత్యోదయ దిశగా కేంద్రప్రభుత్వం పనిచేస్తుందన్నారు.రాష్ట్ర సంపర్క అభియాన్ ప్రముఖ్ గాదె శ్రీనువాసురావు మాట్లాడుతూ బడుగు, బలహీన, సంక్షేమ కులాల ప్రతినిధి,రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలైన కులనిర్మూలన,వర్గ రహిత సమాజ నిర్మాణానికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిందాడ నూకేశ్వరరావు,మహిళ మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి చిందాడ మాధవిలత, యువమోర్చ పట్టణ అద్యక్షుడు కొప్పిశెట్టి మోహన్,మణికంఠ, బుజ్జి, శరత్ తదితరులు పాల్గోన్నారు…