ఆంధ్రప్రదేశ్ప్రాంతీయంరాష్ట్రీయం

రామాయపట్నం ఓడ రేవు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం జగన్

నెల్లూరు : రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ఏపి సీఎం వైఎస్ జగన నేడు ప్రారంభించారు. తొలుత సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ..సముద్రంలో డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం పోర్టు పైలాన్ ఆవిష్కరించారు. రామాయపట్నం ఓటు రేవు(పోర్టు) ను మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్ లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశ లో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తొలి దశలో నాలుగు బెర్త్ లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లు పిలవగా, రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్షియం దక్కించుకుంది. తొలి దశ టెండర్లు ఖరారు కావడంతో నేడు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించారు. తొలి దశ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.ఏపి ప్రభుత్వం.రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజల కల నెరవేరనుంది.ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి ఈ పోర్టు కేవలం నాలుగున్నర కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ పోర్టు వల్ల ఏపితో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార,వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమరనాథ్ రెడ్డి, అంబటి రాంబాబు,పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.