విజయవాడ, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): సీనియర్ జర్నలిస్టు డి. దేవి రాజు (47) మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో పల్లం పెద్దేశ్వరరావు హాస్పిటల్‌లో గుండె పోటుతో మృతి చెందారు. వివిధ పత్రికలలో పని చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేశాడు. ఆయన సొంతంగా ‘ఫ్రైడే మెయిల్’ అనే పత్రికను నడుపుతున్నారు. నగరంలో ఆయన యాక్టివ్ జర్నలిస్టుగా అందరికీ సుపరిచితులే. ఆయన మృతి పట్ల ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ తీవ్ర సంతాపం తెలియజేస్తుంది.
ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, కార్యదర్శి వసంత్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, నగర అధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు, ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి సభ్యులు దారం వెంకటేశ్వరరావు, రామారావు, సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు ఉన్నారు. ఆయన మృతి పట్ల తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.