రాష్ట్రీయం

టీడీపీ నేత వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

గుంటూరు, జనవరి 23 (న్యూస్‌టైమ్): ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు తీరును ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని నాగబైరు విజయలక్ష్మి టీడీపీకి రాజీనామా చేశారు. ఆమె వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్యే విడ‌ద‌ల‌ రజనీ సమక్షంలో విజయలక్ష్మి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. నాగబైరుకు కండువా కప్పిన నేతలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు ద్వితియశ్రేణి నేతలు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.