ఆంధ్రప్రదేశ్రాజకీయంరాష్ట్రీయం

రూయా ఆసుపత్రిలో మరణించిన వారి బంధువులను పరామర్శకు వెళ్లిన భాజపా నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం.

పాతూరి నాగ భూషణం గారు,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, కోవిద్ సేవా సెల్ ఇన్ఛార్జి.

తిరుపతి : రూయా ఆసుపత్రిలో మరణించిన వారి బంధువులను పరామర్శించడానికి వెళ్లిన భాజపా నాయకులు భానుప్రకాష్ రెడ్డి,దయాకర్ రెడ్డి, ఇతర కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని పాతూరి ఖండించారు.ఈ సదర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, కోవిద్ సేవా సెల్ ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం  మాట్లాడుతూ భాడితుల్ పరామర్శకు వెళ్లిన వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులు, బాధితులకు సలహా, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కోవిద్ నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇంజక్షన్లు, వాక్సినేషన్ సమస్యలపై కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన బాధితులకు సలహాలు, సూచనలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ కోవిద్ సేవా సెల్ ఏర్పాటుచేసిందని అన్నారు.ఈ సెల్ కి తనను ఇన్ఛార్జిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నియమించినట్లు చెప్పారు.ఈ సెల్ ద్వారా కరోనా బాధితులు సమస్యలను వివరిస్తే వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు చేస్తామన్నారు.కోవిద్ బాధితులకు చికిత్సకోసం ఏర్పాటుచేసిన 104 సర్వీసు క్రియాశీలకంగా పనిచేయడం లేదన్నారు. 104 సర్వీసు మరింత బాగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న 3 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని హామీ ఇచ్చిన సిఎం ఎందుకు లేఖలతో కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు.23 నెలలుగా రూ.85 వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,600 కోట్లు పెద్ద మొత్తం కాదని, వెంటనే అడ్వాన్సులు చెల్లించి వ్యాక్సిన్లు తెప్పించి అవసరమైనవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం కోవిద్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి మందులు, వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ ను సరఫరా చేస్తుందని చెప్పారు.కోవిద్ రెండో దశ వ్యాప్తి ఉదృతంగా ఉన్న దృష్ట్యా ప్రజలంతా ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వానికి సహరించాలని కోరారు. కరోనా వలన ప్రాణాలు కోల్పోతున్న కుటుంబసభ్యులను పరామర్శించడానికి తక్కువ మంది వెళ్ళడం, స్మశానవాటికలకు పరిమిత సంఖ్యలో వెళ్లి కార్యక్రమాలను ముగించడం వలన ఎక్కువమంది గుంపులుగా కూడకుండా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు వైన్ షాపులు కోవిద్ విస్తరణకు దోహద పడు తున్నాయని వాటిని తక్షణం మూసివేయాలని డిమాండ్ చేశారు.ఆరుగంటల నుంచి 12 వరకు క్యూలో నిలబడి పోటీపడి మరీ లిక్కర్ కొనుగోలు  చేస్తున్నారు.కరోనా ఉధృతి తగ్గేవరకు వైన్ షాపులను కరోనా వ్యాప్తిని కొంతమేరకు కట్టడిచేయవచ్చుని పేర్కొన్నారు.వ్యాక్సినేషన్ తీసుకుంటే కరోనా రాదనే అవేర్నెస్ ఇప్పుడు ప్రజల్లో బాగా పెరిగిందన్నారు. మొదటి డోస్ వేసుకుని రెండవ డోస్ వేసుకున్న వారికి ఎక్కడా కూడా కరోనా ఎఫెక్ట్ కనిపించడం లేదు కానీ ఈరోజు మొదటి డోస్ వేసుకుని రెండవ డోస్ వేసుకోవలసిన వారికి ఆ డేట్స్ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ బాగానే స్పందిస్తూ ప్రజలకు అవసరమైన సేవలు,సహకారం  అందించడానికి కృషి చేస్తున్నారని, ఆయనే కాకుండా కింది స్థాయిలో అధికారులు పని చేయాల్సిన అవసరం వుందన్నారు.కాబట్టి వైద్యఆరోగ్యశాఖ శాఖ మరింత బాగా పనిచేయాలని, రెండోడోసు వాక్సిన్ అవసరమైనవారికి వెంటనే వేయాలని చెప్పారు…
—- ఐ హబ్ సౌజన్యంతో —–