ఈ నెల 16న ఆరోగ్య స్వయం సేవకుల శిక్షణా శిబిరం ఏర్పాటు.

నర్సీపట్నం : దేశవ్యాప్తంగా ప్రజలలో ఆరోగ్యం పట్ల చైతన్యం తీసుకొచ్చే విధంగా బిజెపి ఆధ్వర్యంలో 4లక్షల మంది ఆరోగ్య స్వయం సేవకులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జ్ ఎస్.వి.ఎస్ ప్రకాష్ రెడ్డి అన్నారు.తేదీ 13/08/2021 అనగా శుక్రవారం నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక బిజెపి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరందరూ జిల్లా,మండల గ్రామస్థాయిలో పర్యటించి కరోనా వ్యాధి పట్ల ప్రజలను చైతన్యం చేసి కరోనా వ్యాక్సిన్ అందరూ వేసుకునే విధంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని కోరారు.ఈ నెల 16న జిల్లా స్థాయిలో అనకాపల్లిలో అన్ని మండలాల కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం ఉందన్నారు. నియోజవర్గంలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారంకు కార్యకర్తలందరూ కృషి చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చదరం నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం మండల కమిటీలు, బూత్ కమిటీలు, వివిధ మోర్చాలా కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందే విధంగా బూత్ స్థాయి వరకు తీసుకోని వెళ్లాలని అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహా సంపర్క ప్రముఖ్ గాదె శ్రీనివాసరావు, అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు తమరాన ఎర్రన్నాయుడు,సీనియర్ నాయకులు చిందాడ నూకేశ్వరరావు, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు గొంప వెంకటేశ్వరరావు యాదవ్ (బాబా), మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వి లక్ష్మి, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడిగర్ల సతీష్ ,నర్సీపట్నం మండల అధ్యక్షులు బోలెం శివ,పట్టణ అధ్యక్షులు వెలగా జగన్నాధ్, నాతవరం మండల అధ్యక్షులు లాలం వెంకటరమణ, మాకవరపాలెం మండల అధ్యక్షులు గంగిరెడ్డి రఘు చక్రవర్తి, గొలుగొండ మండల అధ్యక్షులు గుమ్మడి గణేష్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…

Latest News