న్యూస్ప్రాంతీయంస్థానికం

నాతవరం ఎస్సైగా రామారావుకు పూర్తిస్థాయిబాధ్యతలు

రిపోర్టర్ : పల్లా గోవిందరావు

నాతవరం,, కోస్తా టైమ్స్, : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం మండలం పోలీస్ స్టేషన్ లో ఎస్సై స్థానం ఇటీవల ఖాళీ ఏర్పడడంతో గత కొంతకాలంగా నాతవరం ఇన్చార్జి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న నర్సీపట్నం రూరల్ ఎస్సై రామారావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా నాతవరం మండలంలో ఎస్ఐ స్థానం ఖాళీగా ఉండటంతో, ఉన్నతాధికారులు మండల పోలీస్ స్టేషన్ కు పూర్తిస్థాయి ఎస్సై ను నియమించడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.