న్యూస్ప్రాంతీయంరాజకీయం

మెప్మా అర్బన్ మార్కెట్ తో మహిళలకు ఆర్థిక స్వావలంబన

ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, మెప్మా స్టాల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

రిపోర్టర్ : పల్లా గోవిందరావు

నర్సీపట్నం, కోస్తాటైమ్స్,( అక్టోబర్ -21) : డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రుణాలు అందించి, మెప్మా ద్వారా పలు వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు ఏర్పాటుచేసిన మెప్మా అర్బన్ మార్కెట్ స్టాళ్లను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ శనివారం ప్రారంభించారు . ఈ మార్కెట్లో నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన 41 స్వయం సహాయక సంఘాలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ప్రతి స్టాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే మెప్మా రుణం ద్వారా మహిళలు పొందుతున్న ఆదాయ మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మెప్మా ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామని, మెప్మా రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా వృద్ధి పొందుతున్నారన్నారు. ఒక్కొక్కరు తమ తమ వ్యాపారాల ద్వారా నెలకు 20 వేల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నామని తెలిపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను ప్రోత్సహించిన పట్టణ పేదరిక నిర్మూలన( మెప్మా) అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

మెప్మా పి డి సరోజినీ మాట్లాడుతూ, మెప్మా ద్వారా డ్వాక్రా మహిళలకు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఋణ సౌకర్యం కల్పిస్తున్నామని, వీటి ద్వారా మహిళలు వివిధ రకాల వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. స్వశక్తితో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసమే మెప్మా కృషి చేస్తుందన్నారు. త్వరలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హెచ్ వి జయరాం, మున్సిపల్ మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, పట్టణ వైసిపి అధ్యక్షుడు యాకా శివ, కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి, సిరసపల్లి నాని, కోఆప్షన్ సభ్యురాలు రోజా, ఏఎంసి వైస్ చైర్మన్ మళ్ళ గణేష్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.