పంచాయతీ సర్పంచులకు, కార్యదర్సులకు శిక్షణ తరగతులు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట ఇన్స్టిట్యూట్ అఫ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి డైరెక్టర్ ధావన్ ఆదేశాలు మేరకు జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచులకు, కార్యదర్సులకు పంచాయతీ కార్యకలాపాలపై మూడురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. మండలస్థాయిలో మండల పరిషద్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జరుగు ఈ శిక్షణ తరగతులలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు నిర్వహణ, పంచాయతీ పరిపాలన తదితర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. రెండు విడతలలో జరుగు ట్రైనింగులో ఆగష్టు 12 నుంచి ఆగష్టు 14 వరకు జరుగు మొదటి విడత ట్రైనింగులో 23 మండలాల నుంచి సర్పంచులు, కార్యదర్సులు పాల్గొనగా ఆగష్టు 16 నుంచి ఆగష్టు 18 వరకు జరుగు రెండవ విడత శిక్షణ తరగతులలో 25 మండలాల నుంచి సర్పంచులు, కార్యదర్సులు పాల్గొనుదురని అన్నారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే సర్పంచులకు, కార్యదర్సులకు ఉచిత వసతులు సౌకర్యం కల్పించానున్నామని అలాగే ప్రాజెక్టర్ ద్వారా సెషన్ మాడ్యూల్స్ చెప్పనున్నామని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. 100% హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోమని ఎంపీడీఓలకు ఆదేశాలు జారిచేశామని అన్నారు…

Latest News