నర్సీపట్నం : భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో అసెంబ్లీ లో గల అన్ని పంచాయతీల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని జిల్లా ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కె.ఎన్.ఆర్ వసతి గృహము వద్ద అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు పంచాయితీ నుండి పార్లమెంటు వరకు ఎన్నికలలో పోటీ చేయాలనే సంకల్పంతో అసెంబ్లీలో గల అన్ని పంచాయతీలలో గెలుపోటములతో నిమిత్తం లేకుండా అభ్యర్థులను నిలిపేందుకు పని చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి గల యువకులకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆహ్వానం పలుకుతున్నమన్నారు. బిజెపి జనసేన పార్టీ పూర్తి సమన్వయంతో ఈ ఎన్నికలలో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన జిల్లా ఇంచార్జ్ ప్రకాశ్ రెడ్డిని దుశాలువాతో సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంలో పలువురు వివిధ మండలాల సర్పంచ్ అభ్యర్థులను కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, సీనియర్ నాయకులు గాదె శ్రీనివాసరావు,ఓబీసీ మోర్చా నాయకులు బంగారు ఎర్రినాయుడు, నాతవరం మండల అధ్యక్షులు లాలం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, మాకవరపాలెం మండల ఉపాధ్యక్షులు యర్రంన్నాయుడు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నేతల బుచ్చిరాజు, నూకరాజు , యువ మోర్చా అధ్యక్షులు ఎం. పృథ్వీరాజ్, రాజాన రమణ తదితరులు పాల్గొన్నారు.