భారత మాజీ ప్రధాని,భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి “సుపరిపాలన దినోత్సవం” సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సందేశం.

విజయవాడ : భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ‘సుపరిపాలన దినోత్సవం’ జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియ చేసారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకుంటూ,దేశ ప్రజల ప్రియమైన నాయకుడికి నివాళి అర్పిస్తూ  ప్రభుత్వ పారదర్శకత,జవాబుదారీతనంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కోన్నారు. సుపరిపాలన పట్ల పౌరులకు స్పృహ కలిగించడమే ఈ దినోత్సవం లక్ష్యమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కానీ, సమాజంలో కాని అవినీతికి చోటు లేదని సుపరిపాలన మనకు గుర్తుచేస్తుందని గవర్నర్ వివరించారు. సుపరిపాలన దినోత్సవం ప్రతి ఒక్కరికి ఆనందం,గౌరవం,సమాన అవకాశాలతో జీవించే హక్కు ఉందని సూచిస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.ఈమేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు…

Latest News