రాష్ట్రంలో మోగిన స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల న‌గారా.

అమ‌రావ‌తి: రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే స్ధానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ఎన్.ర‌మేష్‌కుమార్ విడుదల చేసారు.రాష్ట్రంలో 13 జిల్లాలలోని ఎంపిటిసిలకు,జడ్పీటీసిలకు రెండు విడుతలలో పోలింగ్ నిర్వహింస్తామ‌ని తెలిపారు.తొలి విడత పోలింగ్ ఈ నెల 21 వ తేదిన జరగనుండగా,తుది విడత పోలింగ్ 24న నిర్వహించనున్నామ‌ని పేర్కోన్నారు. మున్సిపాలిటీలకు,నగర పాలక సంస్థలకు పోలింగ్ ఈ నెల 27 నిర్వహిస్తామ‌న్నారు.ఇక అన్ని ఎన్నికల ఓట్ల లెక్కింపు 29 న చేపట్టి ఫలితాలను విడుద‌ల చేస్తామ‌ని ప్రకటించారు.ఈ రోజు నుండే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తుంద‌న్నారు.

రాష్ట్రంలో జ‌రిగే స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ :
తొలి విడత ఎంపిటిసిలకు, జడ్పీటీసిలకు నోటిపికేషన్ – 07.03.2020
రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ 09.03.2020
నామినేషన్స్ స్వీకరణ – మార్చి 9వ తేది నుంచి 11వ తేది వరకు
నామినేషన్స్ పరిశీలన – మార్చి 12
నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరు తేది : 14.03.2020 మధ్యాహ్నం 3 గంటల వరకు
పోలింగ్ – 21.03.2020
ఓట్ల లెక్కింపు 29.03.2020

మలి విడత నోటిఫికేషన్ – 10.03.2020
రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ – 12.03.2020
నామినేషన్స్ స్వీకరణ – మార్చి 12వ తేది నుంచి 14వ తేది వరకు
నామినేషన్స్ పరిశీలన – మార్చి 15
నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరు తేది – 17.03.2020 మధ్యాహ్నం 3 గంటల వరకు
పోలింగ్ – 24.03.2020
కౌంటింగ్ – 29.03.2020

మునిపల్ ఎన్నికల షెడ్యూల్
నోటిపికేషన్ – 13.03.2020
రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ 15.03.2020
నామినేషన్స్ స్వీకరణ – మార్చి 15వ తేది నుంచి 17వ తేది వరకు
నామినేషన్స్ పరిశీలన – మార్చి 18
నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరు తేది : 20.03.2020 మధ్యాహ్నం 3 గంటల వరకు
పోలింగ్ – 27.03.2020
ఓట్ల లెక్కింపు 29.03.2020

Latest News