అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.ఈ నెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 2,500, విశాఖకు 850, విజయవాడకు 600, బెంగళూరుకు 300,చెన్నైకు 120 బస్సులు నడపనున్నారు.జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు మరికొన్ని ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి.వీటికి ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది.ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలను ఏపీఎస్‌ఆర్టీసీ వసూలు చేయనుంది…