- రాష్ట్రంలో కుల పోరాటాలు జరుగుతున్నాయన్న జీవీఎల్
- ప్రజల భాగస్వామ్యం కనిపించడంలేదని వ్యాఖ్యలు.
న్యూడిల్లీ : దేశవ్యాప్త జన సంవాద్ వర్చువల్ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా కోస్తాంధ్ర జిల్లాల కార్యకర్తలను ఉద్దేశించి కేంధ్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ పరిణామాలపై స్పందించారు. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని అన్నారు.అవినీతిపై పోరాడతామన్న వైసీపీ, అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలేవీ లేవని విమర్శించారు.అవినీతి నిర్మూలన అంశాన్నిరాజకీయపరంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఏదని అన్నారు.కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా నాలుగు గ్రహణాలు పట్టాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గతంలో కేంధ్ర పధకాలకు టిడిపి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటే ఇప్పుడు వైయస్ఆర్ పార్టీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటున్నాయని అన్నారు.దేశం కోసం పనిచేసిన ప్రకాశం పంతులు , గురజాడ , వీరేశలింగం వంటివారు కనిపించరా..? అని నిలదీశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్,జగన్…వీళ్లేనా మహానాయకులు? అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భాజపా సహా ఇంచార్జి శ్రీ సునీల్ దేయోదర్ గారు,యపీలు ,సి.యం రమేష్ గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు ,ఎన్. వై.కె వైస్ ఛైర్మన్ శ్రీ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి గారు,జైపూర్ నుండి ఆలిండియా సంఘటనా సంయుక్త కార్యదర్శి సతీష్ గారు,హైదరాబాద్ నుండి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ గారు,విజయవాడ నుండి సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. మధుకర్ జీ పాల్గొనడం జరిగింది…