నర్సీపట్నం: నర్సీపట్నం ప్రాంతంలో కరోనా వైరస్ ఉదృతి కారణంగా 17వ తారీకు నుంచి అనగా శుక్రవారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వచ్ఛందంగా తమ వ్యాపార వేళలను పాటిస్తూ మూసివేయాలని వ్యాపార వర్తక సంఘ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ఆర్డిఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఆర్డిఓ లక్ష్మీ శివ జ్యోతి అధ్యక్షతన వర్తక సంఘం ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు , ఆర్డిఓ ఆఫీస్ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అజెండా
1 ) ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు షాపులకు అనుమతి.
2 ) రెస్టారెంట్లకు ఒక గంట సేపు పొడిగింపు అనగా మూడింటి వరకు అనుమతి. అది పార్సిల్ సదుపాయం మాత్రమే ఉంటుంది.
3 ) ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్.
4 ) రెండు గంటలు దాటాక పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనగా ఆటోలు లాంటి వాహనాలు తిరగకూడదు.
5 ) ఈ నిబంధనలు ప్రస్తుతం ఆగస్టు నెలాఖరు వరకు అమలు చేస్తారు.మధ్యలో ఆగస్టు నెలలో ఒకసారి సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు…