నర్సీపట్నం : అవినీతిలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని,ఇల్లు నిర్మాణంలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కఠిచర్యలు కఠిచర్యలు తీసుకోవాలని నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగిన నిరసనలో పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గత ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హౌసింగ్ లో జరిగిన అవినీతిపై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారని కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైబడిన ఈనాటికి హౌసింగ్ లో జరిగిన అవినీతిపై విచారణ జరపలేదన్నారు.పట్టణ అధ్యక్షులు ఎడ్ల గణేష్ మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 2020 వరకు 12 లక్షల ఇల్లులు మంజూరు చేయడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిరుపేదలకు ఇవ్వదలచి ఇళ్ల స్థలాల విషయంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, ఇప్పటికే కట్టిన ఇళ్లను వెంటనే నిరుపేదలకు ఇవ్వాలన్నారు. అనంతరం ఆర్డీవో శివజ్యోతికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిందాడ నూకేశ్వరరావు,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బంగారు ఎర్రి నాయుడు , పట్టణ కార్యదర్శి సంతోష్, మాకవరపాలెం మండల అధ్యక్షులు గవిరెడ్డి రఘు చక్రవర్తి, గొలుగొండ మండల అధ్యక్షులు సుర్ల సప్తగిరి శ్రీనివాస్(కొండబాబు), పిల్లా వెంకటేశ్వరరావు యాదవ్, గొంప వెంకటేశ్వరరావు యాదవ్ (బాబా),కురచ కామేశ్వరరావు, పల్లా రమణ యాదవ్,కిల్లాడ లోకేష్ , పట్టణ ఉపాధ్యక్షులు రుత్తల సన్యాసిరావు, యువ మోర్చా నాయకులు మల్ల పృధ్వీరాజ్,ఎస్సీ మోర్చా నాయకులు నేతల బుచ్చిరాజు మహిళా మోర్చా నాయకులు ఎస్ మల్లేశ్వరి రాజాన అప్పలనర్స,సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు…