రామతీర్థం దోషులను కఠినంగా శిక్షించాలి. బిజెపి డిమాండ్

నర్సీపట్నం : విజయనగరం జిల్లా శ్రీరామ తీర్థం పుణ్యక్షేత్రంలో గల బొడికొండపై ఉన్న శ్రీరామచంద్ర మూర్తి ఆలయంలో రాము ని విగ్రహం ధ్వంసం చేసి రాముని తలను ఖండించి కొలనులో పడవెసిన ఘటన హిందూ సమాజం యొక్క మనోభావాలను యిటువంటి సంఘటనలు తీవ్ర ద్రిగ్బాంతి గురి చేస్తుంది. హిందూ దేవాలయాలపై వరుస దాడులలో నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం , దేవాదాయశాఖ మంత్రి పూర్తిగా విపలమైయారని,మంత్రి వెళ్లంపల్లి శ్రీనివాస్ వెంటనె రాజీనామా చెయ్యాలని నర్సీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు అన్నారు. పట్టణ అధ్యక్షుడు యడ్ల గణేష్ మాట్లాడుతూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోని, కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి చర్యలు రాబొవు కాలంలో జరగకుండా కఠిన చట్టాలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శీరంరెడ్డి సావిత్రి మాట్లాడుతూ రాష్ట్రాంలో శాంతి భధ్రతలను దృష్టిలో పెట్టుకొని హిందువుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. నిరసన తెలియజేసిన అనంతరం నర్సీపట్నం మండల తహసిల్దారు కార్యాయలంలో వినతి పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఒ.బి.సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొంప వెంకటేశ్వరరావు (బాబా), సీనియర్ నాయకులు శీరంరెడ్డి చినసత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి దార్ల సోమ ప్రభాకర్,మహిళ మోర్చా టౌన్ అధ్యక్షురాలు మల్లీశ్వరి, ఎస్.సి మోర్చా టౌన్ అధ్యక్షుడు నేతల బుచ్చిరాజు, యువ మోర్చా రాష్ట్ర నాయకులు బోలెం శివ, టౌన్ అధ్యక్షుడు పృధ్వీరాజ్ ,మోహన్, కళ్యాణ్, రాజాన రమణ తదితరులు పాల్గొన్నారు…

Latest News