న్యూఢిల్లీ, జనవరి 22 (న్యూస్‌టైమ్): తాజా అంచనాల ప్రకారం, దేశంలో 6 రాష్ట్రాలలో (ఛత్తీస్‌గఢ్, హర్యానా, కేరళ, మధ్య ప్రదేశ్, మహరాష్ట్ర, పంజాబ్) ఏవియన్ ఇన్ల్ఫూయెన్జా (ఎఐ) ఉన్నట్టు ధ్రువీకృతమైంది. పది రాష్ట్రాలలోని (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) కాకులు/వలుస/అడవి పక్షులకు ఎఐ సోకినట్టు రూఢి అయింది. అంతేకాకుండా, మహారాష్ట్రకు చెందిన థానే (కళ్యాణ్), యావత్‌మల్ (ధుంకి, పుసాద్), వార్ధా (చక్ని, హింగాఘాట్), గోండియా (నింబా, గోరేగాంవ్), అహ్మద్‌నగర్ (భూమిర్, చవాన్), హింగోలీ (పింప్రీ, ఖుర్ద్) జిల్లాలలోనూ, మధ్య ప్రదేశ్‌కు చెందిన రైసెన్ (గైరాత్‌గంజ్), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంతెవాడ జిల్లాల నుంచి సేకరించిన పౌల్ట్రీ శాంపుళ్ళతో ఎఐను నిర్ధారించారు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఉన్నావా జిల్లా (హధా, సికందర్‌పూర్, కరన్)లో బాతులకు ఎఐ సోకినట్టు రూఢి అయింది. నియంత్రణ, నిరోధక కార్యకలాపాలు ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో తీవ్రంగా ప్రభావవితమైన ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. దేశంలో ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసిన కేంద్ర బృందం, మహరాష్ట్రలోని పర్భని జిల్లాలో ఎఐ కేంద్రీకృతమైన ప్రాంతంలో ఎఐ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు, సాంక్రమిక వ్యాధిని అధ్యయనం చేయడానికి పర్యటించింది.
అన్ని రాష్ట్రాలు/యుటిలు సవరించినఏవియన్ ఇన్ఫూయెన్జా 2021కి సంసిద్ధత, నియంత్రణ, నిరోధక చర్యల కార్యాచరణ పథకం ఆధారంగా తాము అనుసరిస్తున్న నియంత్రణ చర్యల గురించి ప్రతినిత్యం శాఖకు నివేదిస్తున్నాయి. సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్‌బుక్ హాండిల్స్) సహా బహుళ వేదికల ద్వారా ఎఐ గురించి చైతన్యాన్ని పెంపొందించేందుకు శాఖ నిరంతరం కృషి చేస్తోంది.