హైదరాబాద్, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఆలంపూర్‌లో జరిగే జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఇవాళ ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.