దేశవ్యాప్తంగా 187.03 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) క‌వ‌రేజ్‌తో రైతులకు భ‌రోసా కల్పించే ఉద్దేశంతో ఫిబ్ర‌వ‌రి, 2020 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక‌ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్ అందించిన సమాచారం మేర‌కు ఈ ఏడాది జనవరి 29వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా రైతులకు 1.76 లక్షల కోట్ల రూపాయల రుణ పరిమితి క‌లిగిన దాదాపు 187.03 లక్షల కేసీసీలు మంజూరు అయ్యాయి. అర్హులైన రైతులందరికీ వారి వ్యవసాయ కార్యకలాపాల‌లో ఇబ్బంది రాకుండా సకాలంలో క్రెడిట్ అందేలా చూసేందుకు, రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి సాగు అవ‌స‌రాల‌ను కొనుగోలు చేయడానికి రైతులకు వీలుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకాన్ని ప్రవేశపెట్టారు. 2012 నుంచి కేసీసీ పథకం మరింత సరళీకృతం చేశారు.

ఏటీఎం సౌక‌ర్యంతో కూడిన డెబిట్‌కార్డ్, ఇంటర్ ఎలియా, ఒకేసారి డాక్యుమెంటేషన్ సౌకర్యం, పరిమితిలో అంతర్ నిర్మిత వ్యయాల‌ పెరుగుదల, నిర్ణీత వ్య‌వ‌ధిలోన‌ అపరిమితి ఉపసంహరణల‌కు వీలు మొదలైనవి క‌ల్పించ‌డ‌మైంది.

Latest News