‘విశాఖ ఉక్కు రక్షణ బాధ్యత అందరిదీ’

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): ఎంతోమంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రయివేట్ పరం కాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రల ప్రజలపై ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రజలతో, ఉద్యోగులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో టాక్స్‌ల రూపంలో ఇప్పటి వరకు 46000 వేల కోట్లరూపాయలు చెల్లించిందని, అదే విధంగా రాష్ట్ర ప్రభత్వానికి 9000 వేల కోట్ల రూపాయలు చెల్లించిందని లక్ష్మీనారాయణ తెలిపారు.

ప్రస్తుతం విశాఖ ఉక్కుకు 20,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉందని, ఆ కారణంతో విశాఖ ఉక్కును ప్రయివేట్ పరం చేయడాన్ని తెలుగు ప్రజలు అడ్డుకోవాలని అయన కోరారు. విశాఖ ఉక్కును సెయిల్‌లోను ఎన్ఎండీసీలోను కలిపితే విశాఖ ఉక్కు లాభలలోకి రావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సాదిస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు.

Latest News