న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (న్యూస్‌టైమ్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఐఐటీ ఖరగ్‌పూర్ వద్ద డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిసెర్చిని ప్రారంభించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఐఐటీ ఖరగ్‌పూర్ 66వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగించనున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్, కేంద్ర విద్యాశాఖమంత్రి కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విద్యా మంత్రిత్వశాఖ మద్దతుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నెలకొల్పింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో పెట్టుబడి పెట్టడం, దేశ పరిశోధన ప్రతిభ ద్వారా భారతదేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ప్రేరణతో ఈ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పుతున్నారు. సాంకేతికత, హెల్త్‌కేర్‌లమేలు కలయికగా ఈ ఆస్పత్రి ఉండనుంది. ఆరోగ్య రంగ సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ఐఐటి ఖరగ్‌పూర్‌కు ఉన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ ఈ ఆస్పత్రి బయోమెడికల్, క్లినికల్, ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్, రిమోట్ డయాగ్నస్టిక్స్, టెలిమెడిసిన్, టెలి రేడియాలజీలపై దృష్టిపెట్టడంతోపాటు,డ్రగ్ డిజైన్, డెలివరీ వ్యవస్థలపై కూడా ఇది ప్రత్యేక దృష్టిపెట్టనుంది. 2021-22 సంవత్సరం నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టొరల్ ప్రోగ్రాంతో పాటు ఎం.బి.బి.ఎస్ ప్రోగ్రాం ప్రారంభం కానుంది.