చెరువులో తేలిన ప్రేమజంట

నల్గొండ, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పెద్ద చెరువులో దూకి ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. యువతి, యువకుడు కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలింపు చేపట్టారు.

ఉదయం చెరువులో రెండు మృతదేహాలు తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయించారు. తాము వెతుకున్న యువతీ యువకుడే ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి పోలీసులతో పాటు కుటుంబసభ్యులు షాకయ్యారు. ప్రేమ వ్యవహారం వల్లనే వీరు అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Latest News