బిజెపి పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ మృతి పట్ల సంతాప కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు.


నర్సీపట్నం : పట్టణ అధ్యక్షులు యడ్ల గణేష్ అకాల మరణం పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోందని సీనియర్ నాయకులు గాదె శ్రీనివాసరావు  పేర్కొన్నారు. తేది 31/05/2021న సోమవారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఏ పిలుపునిచ్చినా నేనున్నాను అంటూ ముందుండి ఆ కార్యక్రమాలను  దిగ్విజయంగా నిర్వహించిన యడ్ల గణేష్ ఈ రోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పార్టీ దిగడానికి అన్ని వేళలా విశేషంగా చేసిన ఘనత గణేష్ దేనని పేర్కొన్నారు తన అధ్యక్షత కాలంలో అనేకమందిని పార్టీలోకి తీసుకురావడంలో తీవ్రకృషి చేయడం జరిగిందన్నారు.పార్టీలో గణేష్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. పార్టీలో పనిచేసిన అతి తక్కువ కాలంలోనే పార్టీ నాయకుల అభిమానం సంపాదించుకున్నారన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తమరాన ఎర్రన్నాయుడు, ఓబిసి మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు బంగారు ఎర్రినాయుడు,నాతవరం మండల అధ్యక్షులు లాలం వెంకటరమణ, పట్టణ సీనియర్ నాయకులు ఐ.సంతోష్, బొలెం శివ, దళితమోర్చ నాయకులు రాజన రమణ, నేతల బుచ్చిరాజు, గుమ్ముడు గణేష్, అడిగర్ల సతీష్, పృథ్వీరాజ్ మోహన్ తదతరులు పాల్గొన్నారు…

Latest News