జయపురం/ఒడిశా: ఉమ్మడి కోరాపుట్ జిల్లాలో ఇ-సేవలు, ప్రయోగాత్మక శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-ఫైలింగ్ స్టేషన్ ఉమ్మడి కోరాపుట్ జిల్లా వంటి ఉప జిల్లాలో గిరిజన ప్రజలు మరియు న్యాయవాదులకు కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోరాజ్ దాస్ మాట్లాడుతూ జయపురం కోరాపుట్ జిల్లా కోర్టు నుంచి 40 మంది న్యాయవాదులు ఈరోజు ఈ-ఫైలింగ్, ఈ-సర్వీసెస్, ఈ-పేమెంట్స్‌లలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు. కోరాపుట్ కేంద్రంగా హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.