చదువుతో పాటు క్రీడలలోనూ విద్యార్థులు రాణించాలి.

మున్సిపల్ చైర్ పర్సన్ ఆదిలక్ష్మి.

నర్సీపట్నం, కోస్తాటైమ్స్  : విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలలోను ఉన్నతంగా రాణించాలని నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి అన్నారు . మున్సిపాలిటీలోని పెద్ద బొడ్డేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ లో జరుగుచున్న నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను గురువారం ఆమె ప్రారంభించారు. మొదటి పోటీ వాలీబాల్ సర్వీస్ చేసి ఆమె ఈ పోటీలను ప్రారంభించారు. ఈ నెల 21 22 తేదీల్లో మండలంలోని వేములపూడి హైస్కూల్లో నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపిక లు జరిగాయి. ఆ పోటీలలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక నిమిత్తo నియోజకవర్గ స్థాయిలో పోటీలను నర్సీపట్నంలో నిర్వహిస్తున్నారు. కబడ్డీ, కోకో, వాలీబాల్, త్రో బాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర అంశాలలో రెండు రోజులపాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరిస్తూనే క్రీడలలో రాణించి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సాయి శైలజ, ప్రిన్సిపాల్ సాల్మన్ రాజు, ఫిజికల్ డైరెక్టర్ వరహాలు బాబు తదితరులు పాల్గొన్నారు.

Latest News