ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన ఉత్సవాలు.

నియోజకవర్గంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సన్మానం…

నర్సీపట్నం, (జూన్ -07) : భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన ఉత్సవాలులో భాగంగా,నర్సీపట్నం నియోజకవర్గం సీనియర్ కార్యకర్తలు సమావేశం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు కాళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు విచ్చేసి సీనియర్ కార్యకర్తలకు సాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచస్థాయిలో ఇంతమంది కార్యకర్తలతో నిండి ఉంది అంటే పార్టీ స్థాపన దగ్గర నుంచి ఈరోజు వరకు పార్టీ కోసం పని చేసిన సీనియర్ కార్యకర్తల కృషి ఎంతో ఉందని తెలిపారు ప్రస్తుత కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు దగ్గర వారు పార్టీ కోసం అనుసరించిన పద్ధతులను అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే దిశగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేయాలని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకులు అయిన కోట్ని రామస్వామి నాయుడు, డాక్టర్ వి.వి.రామచంద్రరాజు,గంగ తల్లి , కురచా కామేశ్వరరావు, రాజానా రమణ తదితర సీనియర్ నాయకులను సన్మానించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.ఎస్ వర్మ , నర్సీపట్నం మండల అధ్యక్షులు బోలెం శివ, నాతవరం మండల అధ్యక్షులు లాలం వెంకటరమణ రావు, బీజేవైఎం రాష్ట్ర పదాధికారి అడిగర్ల సతీష్, సీనియర్ నాయకులు చిందాడ నూకేశ్వర రావు, నర్సీపట్నం బీజేవైఎం అధ్యక్షుడు కర్రి శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Latest News