రేపు తిరుపతిలో కేంద్ర 16వ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ సభ్యుల స‌మావేశంకు గొలుగొండ జెడ్పిటిసి సుర్ల గిరిబాబు

గొలుగొండ :  ఈనెల 17వ తేదీ సాయంత్రం తిరుపతిలో రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు విభాగాల గ్రామీణ ప్రజాప్రతినిధులతో కేంద్ర 16వ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ సభ్యులుసమావేశం కానున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 9 మంది సర్పంచులను ఐదుగురు ఎంపీపీలను నలుగురు జడ్పీటీసీలను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపిక చేసి వారిని బుధవారం తిరుపతికి ప్రభుత్వ ఖర్చులతో పంపించారు.వీరితో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ సభ్యులు మాట్లాడి గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిధుల అవసరాలు ఇతర అంశాలను తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు.అనకాపల్లి జిల్లా నుండి గొలుగొండ జెడ్పిటిసి సుర్ల గిరిబాబు,అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు బుధవారం తిరుపతికి బయలుదేరి వెళ్లారు.

Latest News