విశాఖపట్నం : ఈ స్ధానిక సంస్ధల ఎన్నికలు నిలపడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కోన్నారు.శనివారం ఆయన విశాఖ పార్టీ కార్యాలయంలో కోర్ట్ జోక్యంతో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది.ఎన్నికల్లో మద్యం, డబ్బు వినియోగించకూడదని సీఎం చెబుతున్నారు.దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉందన్నారు.బిసిలు అంతా టిడిపి వైపు ఉన్నారు. 24శాతం 34శాతం బిసి రిజర్వేషన్ తీసుకుని వెళ్లిన ఘనత టిడిపిది.వివిధ కార్పొరేషన్ డబ్బులను అమ్మ ఓడి పధకానికి మళ్లించేశారన్నారు.ఈ స్థానిక సంస్థ ఎన్నికలో వైకాపా కి గట్టి బుద్ధి చెప్పాలి.34 శాతం నుంచి 27 శాతం తగ్గించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలో16000 బిసిలకు నష్టం జరుగుతోంది. ఒక్క విశాఖ జిల్లాలో 652 ఎంపీటీసీ లు ఉంటే 173 సీట్లు మాత్రమే బీసీ లకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. బీసీ లకు నష్టం జరుగుతు ఉంటే ఎన్నికల సంఘం ఎలా చూస్తూ ఉరుకుంటోంది. బిసి లను ముట్టుకుంటే మసి పోతారని, బి సి ల జోలికి వెళ్లవద్దు జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్క పని జరగలేదు.చెప్పిన పథకాలు అమలు చేయకుండా ,లబ్దిదారులను కొత కొస్తున్నారని తెలిపారు.మహిళా రుణ మాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.రైతు, మహిళ, వృద్దులు కన్నీరుకారిస్తే ఆ ప్రభుత్వం మట్టి కొట్టుకపోవడం ఖాయం. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచారని ఈ ఎన్నికలో దిమ్మ దిరిగే దెబ్బ కొట్టాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వాసుపల్లి గణేష్,రామానాయుడు,పూడి మంగపతిరావు పాల్గోన్నారు.