అమరావతి: మే 14వ తేదీన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టడంతో కరెంటు స్తంభానికి గుద్దుకుని జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్సగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖ వ్రాసారు.విశాఖపట్నం గ్యాస్-లీక్ ప్రమాదం విషయంలో నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం స్పందింక ముందే ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్సగ్రేషియా ఇచ్చి మీ ఔదార్యం చాటుకున్నారని.అదే విధంగా వేతనం సంపాదించే కూలీలకు ప్రకటించిన 5 లక్షల ఎక్సగ్రేషియా వారి కుటుంబాలకు సరిపోదని విశాఖపట్నం గ్యాస్ లీక్ బాధితుల కుటుంబాలకు ఇచ్చినట్లే ఎలాంటి వివక్ష చూపకుండా వీరికి కూడా కోటి రూపాయల ఎక్సగ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ నుంచి కోరుతున్నామని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు.