పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రాలు ప్రారంభం.

విశాఖ‌ప‌ట్నం: పర్యాటకులకు సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలను అందించేందుకు పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రాలు పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తెలిపారు.శుక్రవారం నాడు ఆయన రిషికొండ లోని సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లో విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం బోట్ల రిజిస్ట్రేషన్, ఆపరేషన్స్ నిర్వహిస్తారని తెలిపారు.రిషి కొండ ప్రాంతంలో సంవత్సరానికి 30 వేల మంది పర్యాటకులు బోటింగ్ చేస్తారని తెలిపారు.కంట్రోల్ రూమ్ లో నుండి బీచ్ లో పడవలు తిరుగుతున్నప్పుడు సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తారని, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా మైకులో సూచనలను అందజేస్తారని, పడవలతో నిరంతరం వైర్లెస్ లో సమన్వయం చేస్తారని తెలిపారు.వాతావరణ శాఖ సూచనల ప్రకారం పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు తగు సూచనలు అందిస్తారని తెలిపారు.పడవలో ప్రయాణించేటప్పుడు పర్యాటకులు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. పర్యాటకుల వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు జరిపి బోటింగ్ కు అనుమతిస్తారని తెలిపారు.రెవిన్యూ, ఇరిగేషన్, పోలీసు, టూరిజం శాఖల సిబ్బంది కంట్రోల్ రూమ్ లో పని చేస్తారని తెలిపారు.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, లైటింగ్, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు.ఏపీటీడీసీ, ప్రైవేటు బోట్లను కూడా నడుపుతారని,త్వరలో బోటింగ్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.అనంతరం రిషికొండ లో పర్యాటకుల సౌకర్యం కోసం కొత్తగా ఏర్పాటుచేసిన రక్షిత తాగునీటి సౌకర్యం, డ్రెస్ చేంజింగ్ రూములు, టాయిలెట్ లు, ప్రాథమిక చికిత్స కేంద్రం పరిశీలించి సలహాలు, సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు రాంప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ (రవాణా) రామకృష్ణ, డి వి ఎం ప్రసాద్ రెడ్డి,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు…

Latest News