అమరావతి: అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో ముగిసిన విచారణ.రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారణకు హాజరయ్యారు.అక్రమ మద్యం కేసు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.కొంతమంది ఎస్‌హెచ్‌వోల పనితీరు బాగాలేదు.కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశిస్తే ఏజీపీతో మెమో ఫైల్ చేయించారు. వాహనాలను మూడు రోజుల్లోగా ఎస్‌హెచ్‌వోలు డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ (డీఈసీ)ముందు ప్రవేశపెట్టాలి.వాహనదారులు వెంటనే డీఈసీకి దరఖాస్తు చేసుకోవచ్చు.సీజ్ చేసిన వాహనాలపై మూడ్రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి అని అధికారులను హైకోర్టు ఆదేశించింది.కేసుల్లో వున్నవాహనాలు ఆయా శాఖలకు అప్పగించాలని మెమో జారీ చేశామని డిజిపి కోర్టుకు తెలిపారు.