నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు పెదబోడ్డేపల్లిలో రెండు చేతిబోర్లు ప్రారంభించారు. 12వ వార్డు లో 47 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలు అమలు చేశామని చెప్పారు అర్హులైన పేద ప్రజలకు రాజకీయాలకతీతంగా పథకాలు అందేలా చేశామని ఎటువంటి పైరవీలు లేకుండా పేద ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. వచ్చే నెలలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లో కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు ప్రతి మహిళకు 18750 అర్హత కలిగిన మహిళ అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. నాలుగు దఫాలు గా డోక్రా రుణాలు ప్రతి మహిళకు 75 వేల రూపాయల వరకు ఇస్తానని చెప్పారు.అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కృష్ణవేణి,వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, అధికారి కన్నారావు మాజీ కౌన్సిలర్ సుబ్బలక్ష్మి,బేతిరెడ్డి విజయ్ కుమార్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గోన్నారు.