తుని : అఖిలభారతీయ విధ్యార్థి పరిషత్ (ABVP) కాకినాడ జిల్లా,తుని శాఖ -సక్షం సంయుక్తంగా జులై 9th జాతీయ విధ్యార్థి దినోత్సవం (ఎ.బి.వి.పి. ఆవిర్భావ దినోత్సవం) మరియు జాతీయ రక్త దాతల దినోత్సవం సందర్బంగా తలసమెమియా వ్యాధితొ బాధపడుతున్న వారి సహాయార్థం రక్తదాన కార్యక్రమం తుని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎ.బి.వి.పి జిల్లా సంఘటనా కార్యదర్శి సతీష్, సక్షం జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్,ఎ.బి.వి.పి జిల్లా కన్వీనర్ సూర్య, ఆర్.ఎస్.ఎస్. విధ్యార్థుల ప్రముఖ ఒ. ప్రసాద్ ,కార్యకర్తలు దినేశ్ ,సాయి బాబు,అధిక సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు.