నర్సీపట్నం: ప్రజలు చాలా మంది కరోనా యొక్క తీవ్రత తెలిసికూడా పని లేకున్నా ఇంటి నుండి బయటకు రావడం గుంపులు గుంపులుగా తిరగడం మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సీపట్నం శాఖ అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి పేర్కోన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా అసోసియేషన్ సభ్యులతో స్థానిక డాక్టర్ సమావేశం మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలిపారు.డాక్టర్స్ డే అనేది డాక్టర్ బి.సి.రాయ్ అనే పశ్చిమ బెంగాల్ లోని ప్రభుత్వ వైద్యుని గౌరవార్థం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారని ఆయనకు భారత ప్రభుత్వం భారత రత్న అవార్డుతో ఇవ్వడం జరిగిందన్నారు. డాక్టర్ రాయ్ జననం మరణం కూడా జులై 1వ తేదీ కావడంతో ఆరోజు ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ డే గా ప్రకటించారన్నారు. ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే రోజు ఐ ఎం ఏ తరఫున నర్సీపట్నంలో పలు సేవా కార్యక్రమాలు చేసే వారు అన్నారు. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ రావడం వలన ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నామన్నారు. కరోనా ఒక భయంకరమైన వ్యాధి డాక్టర్లు ఎంతో ధైర్యంగా ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేయడం టెస్ట్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలు నుండి అందరూ వారిని గౌరవించి దగ్గ విషయమన్నారు. దానికి కొన్ని చోట్ల డాక్టర్లపై భౌతిక దాడులకు దానికి కొన్ని చోట్ల డాక్టర్లపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని దయచేసి అటువంటి వాటిని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాధి సోకిన వారికి చికిత్స చేస్తూ ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశంలో కూడా చాలా మంది డాక్టర్లకు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. వారికి మా డాక్టర్స్ అసోసియేషన్ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన అన్నారు. ప్రజలు దయచేసి అందరూ భౌతిక దూరాన్ని పాటించి, మీతో పాటు మీ కుటుంబం , మీ చుట్టు ప్రక్కల వారికి ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలంటూ మనవి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ,డాక్టర్ యక్కల రామకృష్ణ, డాక్టర్ రాయపురెడ్డి శ్రీనివాస్ ,డాక్టర్ కృష్ణ సుమన్, డాక్టర్ అధికారి గోపాల్ రావు ,డాక్టర్ పి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.