రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పటిష్టంకై చర్యలు.

తాడేపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైయస్‌. జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు.ఈ విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల అయ్యింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో భాగంగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను..వైవీ.సుబ్బారెడ్డికి ఉభయగోదావరి,కృష్ణా,గుంటూరు,చిత్తూరు జిల్లాలను..సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలు, అనంతపురం, కడప,నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను తాడేపల్లిలో  పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తారని ప్రకటించారు…

Latest News