రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాల పరిమితి మూడు నెలలు పొడిగింపు.

విజయవాడ : రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి జూన్ 30 నాటికి ముగియడం మరియు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలల పాటు 01.07.2020 నుండి 30.09.2020 వరకు లేదా కొత్త కార్డులు జారీ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు గురువారం జారీచేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈమేరకు ప్రస్తుతం జూన్ 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే 01-07-2020 నుండి 30-09-2020 వరకు ఈ పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు.యాజమాన్యం వారి సంస్థలలో జూన్ 30,2020 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉండి పనిచేయుచున్న పాత్రికేయుల జాబితాను సంబంధిత సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర మరియు జిల్లా కార్యాలయాలకు అందజేయవలసినదిగా వారు కోరారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ గడువును 3 నెలలు పొడిగించినందున కొత్త అక్రిడిటేషన్ కార్డులు, మరియు ప్రస్తుతం ఉన్న కార్డులకు మార్పులు చేర్పులకు దరఖాస్తులు సెప్టెంబర్ 30 వరకు తీసుకొనబడవని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్-19 దృష్ట్యా సామాజిక దూరం పాటించే విధంగా యాజమాన్యం వారి సంస్థలలో అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయుల ఫోన్ నెంబర్ లతో కూడిన జాబితాను మరియు బస్ పాస్ లను ఒక అధీకృత సిబ్బంది ద్వారా సంబంధిత సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాలకు , కార్యాలయ పనివేళల్లో పంపవలసిందిగా కోరారు. యాజమాన్యం సూచించిన వారికి మాత్రమే వారి అక్రిడిటేషన్ల కాల పరిమితి మరో 3 నెలల పాటు కొనసాగుతుందని , అలాగే బస్ పాస్ రెన్యువల్ కు ఓటిపి వారి ఫోన్ నెంబర్లకు నేరుగా చేరుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత దృష్ట్యా పాత్రికేయులు ఈ ప్రక్రియకు సహకరించాల్సిందిగా వారు కోరారు…

Latest News