* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి.
పాడేరు : విశాఖ మన్యంలో పాడేరు ఐ.టి.డి.ఎ పరిధిలోగల పలు అభివృద్ధి కార్యక్రమాలకు 33.39 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఐటిడిఏ ఆవరణలో శిలాఫలకాలు ఆవిష్కరించారు.ముందుగా పాడేరు చేరుకున్న ఆమె మన్యం ప్రజల ఆరాధ్య దేవత మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,గిరిజనసంక్షేమ శాఖ మంత్రిగా మొట్టమొదటిసారి విశాఖ మన్యానికి రావడంతో పాడేరు ఐ.టి.డి.ఎ పరిధిలోగల పలు అభివృద్ధి కార్యక్రమాలకు గిరిజన సంక్షేమం అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.అనంతరం విశాఖ మన్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైద్య కళాశాల పాడేరు పాలిటెక్నికల్ కళాశాల సమీపంలోగల మైదానాన్ని పరిశీలించారు.మంత్రి పర్యటనలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాడేరు శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి అరకు శాసనసభ్యుడు చెట్టి పాల్గుణ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు…