కాన్పూర్ : ఎనిమిది మంది పోలీసులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 8మంది పోలీసును కాల్చి చంపిన వికాస్ దూబే మొన్న ఉజ్జయినిలో పోలీసుకు చిక్కాడు. అతనిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్సు పోలీసులు యూపీ నుంచి కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓవాహనం బోల్తాపడింది. ఆసమయంలో “వికాస్‌దూబే” పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసు లొంగిపొమ్మని కోరినా అతను నిరాకరించడంతో పోలీసు జరిపిన కాల్పుల్లో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈనెల 3వ తేదీ అర్థరాత్రి తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై వికాస్‌దూబే అనుచరులు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దూబే పరారీలో ఉన్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయ సమీపంలో అతడిని పోలీసు అరెస్టు చేశారు.‘దూబే’పై 60కి పైగా హత్యకేసులు, రాజకీయ నాయకులపై బెదిరింపులు, బవంతపు వసూళ్లకు పాల్పడడం వంటి పలు కేసులు ఉన్నాయి