రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చాలా దారుణంగా ఉంది.

పాడేరు : రాష్ట్ర ప్రభుత్వం పని తీరు చాలా దారుణంగా ఉందని రాష్ట్ర పార్టీభవన నిర్మాణ కమిటీ,బిల్డర్స్ సెల్ కన్వీనర్ ఎం.ఎం.ఎన్ పరశురామరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ జిల్లా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎవరు చేసిన పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం పబ్బంగడుపు కుంటుదని అన్నారు.గత టిడిపి ప్రభుత్వం చేసినట్లుగానే ఈ ప్రభుత్వం కూడా ప్రతిదానికీ వైయస్సార్ పేరును స్టిక్కర్లు అతికిస్తుందని అన్నారు. వైరస్ కారణంగా ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకూడదని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్  అభియాన్ ద్వారా 20 లక్షలు కోట్ల రూపాయలతో వివిధ పధకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.ఈ సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు  రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాద్యక్షలు కురుసా రాజారావు, రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి పాంగి రాజారావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్టం శాంతకుమారి,కూడా కృష్ణారావు  అరకు అసెంబ్లీ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాకరి చిన్నయ్య,జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు సల్లా రామకృష్ణా తదితర నాయకులు పాల్గొన్నారు…

Latest News