రేషన్ సరుకుల పంపిణీపై చేతులెత్తిన రాష్ట్రప్ర‌భుత్వం.

అమరావతి : ఇప్పటివరకు బియ్యం తోపాటు కందిపప్పు, లేదా శనగలు ఇచ్చేవారు.ఈసారి బియ్యం మాత్రమే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.వాస్తవానికి జులై నెల నుంచే నగదుకే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.అయితే నవంబరు వరకు రేషన్ ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.అందువల్ల రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది.ఈ నేపథ్యంలో జులై మొదటి విడత పంపిణీ లో బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేశారు.జులై 18వ తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీ లో కందిపప్పు లేకుండా బియ్యం మాత్రమే ఇవ్వాలని నిర్ణయం చేయ‌డం జ‌రిగింది.అంటే ఇక నుండి నవంబర్ వరకు నెలలో ఒకసారి మాత్రమే కందిపప్పు లేదా శనగలు ఇవ్వనున్నారు, చక్కెర మటుకు ఎప్పటిలాగే నగదుకే ఇవ్వనున్నారు.

Latest News