కోటవురట్ల : ఆదివారం కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు 15 లక్షల రూపాయిల చొప్ఫున ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. ప్రమాదం చాలా దురదృష్టకరమని, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ప్రకటించిందని తెలిపారు.