విజయవాడ: 108, 104 నూతన వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.బెంజ్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. రూ.201 కోట్లతో 1068 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఆరోగ్యశ్రీ అధికారులు పాల్గొన్నారు. వాహనాలను సీఎం ప్రారంభించాక.. కొత్త వాహనాలు జగన్ ముందు ప్రదర్శనగా సాగాయి.